అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. రోజా మాత్రం ఈ రెండు రంగాలలో సత్తా చాటిన విషయం అందరికి తెలిసిందే. వరుసగా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న రోజా 2024 ఎన్నికల్లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతానని కూడా నమ్ముతున్నారు

అయితే రోజాలా తనకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని అనసూయ జబర్దస్త్ షోలో చెప్పుకొచ్చారట.అనసూయ కామెంట్లకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుండటం విశేషం. ప్రోమోలో అనసూయ ఆదితో కలిసి నందమూరి నాయకా పాటతో ఎంట్రీ ఇచ్చారట మొన్న పుష్ప స్పూఫ్ స్కిట్ చేయాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందని అనసూయ ఆదిని అడగగా ఆది అసలు మనిద్దరి గురించి మీటింగ్ ప్లాన్ చేయాలా? డేటింగ్ ప్లాన్ చేయాలా? లేదా ఏదైనా ఈటింగ్ ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుండగా అని చెప్పగా ఈ లాస్ట్ టింగు గురించి ఆది నాకు రిహార్సల్స్ లో చెప్పలేదని అనసూయ చెబుతారట.

ఆది వెంటనే అన్ని టింగులు చెబితే ఇన్ని టింగులు ఉండవు అంటూ కామెంట్లు చేశారని తెలుస్తుంది.ఆ తర్వాత అనసూయ ఆదితో నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒకరోజు రోజాగారిలా నేను కూడా అసెంబ్లీకి వెళతానని చెప్పగా నీకు ఇప్పటికే ఫేస్ బుక్ లైవ్ లో చాలా సమస్యలు ఉన్నాయని అసెంబ్లీ సమస్యలు ఎందుకని ఆది రివర్స్ లో ప్రశ్నిస్తాడట.. ఫిబ్రవరి నెల 3వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు

అయితే గతంతో పోలిస్తే జబర్దస్త్ లో కామెడీ తగ్గిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కొందరు టీమ్ లీడర్లు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడం కూడా ఈ షోకు మైనస్ అవుతోందట.. ఈ షోను వదిలేసిన చాలామంది కమెడియన్లు స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో దర్శనమిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే. అందరూ కూడా జబర్దస్త్ పుణ్యమా అని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఆ జబర్దస్త్ షో మాత్రం ఇప్పుడు అంతంతగానే సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: