తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ మీద ఉన్నారు ఈ బ్రదర్స్. ఇక తెలుగులో బిజినెస్ ఉన్న హీరోయిన్ లతో సినిమా చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతామనే ఉద్దేశంతోనే కొంతమంది నటింప చేస్తూ ఉంటారు.. ఇక అందుచేతనే సూర్య కూడా ఇప్పటివరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంతతో కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సూర్య తమ్ముడు కార్తీ కూడా సమంతతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం.

అయితే సమంత కార్తీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు రావాల్సి ఉన్నదట.. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా అప్పుడు ఆగిపోయిందట. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయిందని వార్తలు తమిళ మీడియా నుంచి బాగా వినిపిస్తున్నాయి. బ్యాచిలర్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సతీష్ సెల్వ కుమార్ డైరెక్షన్ లో సమంత-కార్తీక్ నటించబోతున్నారని వార్త వినిపిస్తోంది. చైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాల ఎంపికలో చాలా ముందుగా ఉంది సమంత. ఈమె నటించిన శకుంతల సినిమా కూడా  విడుదలకు సిద్ధంగా ఉంది..

ఇక అంతే కాకుండా ఒక తమిళ మూవీ కూడా విడుదల కోసం వెయిటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిందీలో కూడా తాప్సి డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు సమంత ఒప్పుకున్నట్లు గా సమాచారం. ఇక ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమంత.. తాజాగా కార్తీ సినిమాకి ఓకే చెప్పినట్లు గా తెలుస్తోంది. సమంత ఈ మధ్య కాలంలో హీరోయిన్గానే కాకుండా ఐటెం సాంగ్ లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. దీనితో పాటు తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు చాలా ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: