సీనియర్ ఎన్టీఆర్ తెలుగు యూనివర్సిటీని ఏ సంకల్పంతో పెట్టారో తెలియదని తెలుగు యూనివర్సిటీ ఒక కళా నిలయమని మేకా రామకృష్ణ అన్నారట.
కళాకారులకు మరియు ఔత్సాహికులకు తెలుగు యూనివర్సిటీ పుణ్య స్థలమని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు. అక్కడ చదివిన వాళ్లు ఎంతోమంది కూడా బయట ప్రదర్శనలు ఇస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారని మేకా రామకృష్ణ కామెంట్లు చేశారు. అక్కడ నుంచి వచ్చినవాళ్లలో 500 మంది ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారని మిగిలిన వాళ్లు మాత్రం డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారని మేకా రామకృష్ణ వెల్లడించారట.
ఒక ఆర్టిస్టుకు నాటకమా మరియు సినిమానా అనే విషయంలో తేడా ఉండదని రెండిటికి చాలా తేడా ఉంటుందని మేకా రామకృష్ణ అన్నారట.
నటులకు నాటక రంగంలో మాత్రమే సంతృప్తి కలుగుతుందని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. నాటకాలలో స్క్రిప్ట్ ను మనకు అనుకూలంగా రాసుకోవడం అది సాధ్యమవుతుందని మేకా రామకృష్ణ వెల్లడించారు. సినిమాలలో లిమిటేషన్స్ ఉంటాయని సీరియళ్లలో కూడా ఇదే పరిస్థితి అని రామకృష్ణగారు అన్నారు.