బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అటు ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు అటు బిగ్బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు సల్మాన్ ఖాన్. బిగ్ బాస్ కార్యక్రమంలో తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు.  ఇటీవలే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్బాస్ సీజన్ 15 ఫినాలే స్టేజ్ పై అంటూ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇక బిగ్బాస్ స్టేజ్ పై ఇటీవల పెళ్లి చేసుకున్న కత్రినాకైఫ్ గురించి మాట్లాడాడు సల్మాన్ ఖాన్.


 అయితే అప్పట్లో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై ఇద్దరూ స్పందించక పోయినప్పటికీ వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూస్తే మాత్రం అందరూ ఇదే అనుకున్నారు. కాగా ఇటీవలే బిగ్బాస్ కార్యక్రమంలో భాగంగా కత్రినాకైఫ్ నటించిన చెక్కిలి చమేలి పాటకు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ డాన్స్ చేయగా.. ఇక ఆ తర్వాత అద్భుతంగా డాన్స్ చేసారు అంటూ వారిని అభినందించిన సల్మాన్ ఖాన్.. కత్రినా కైఫ్ వివాహం గురించి మాట్లాడారు. కత్రినా మీ వివాహ జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వివాహంతో అందరూ సంతోషిస్తున్నారు అంటూ కెమెరా వైపు చూసి తెలిపాడు.


 ఆ తర్వాత మైక్ పట్టుకొని బిగ్బాస్ స్టేజి మీదికి వచ్చిన షేహనాజ్ సరదాగా సల్మాన్ ఖాన్ తో మాట్లాడింది. మీరు కూడా సంతోషంగా ఉన్నారా అంటూ సల్మాన్ ఖాన్ ప్రశ్నిస్తుంది. అయినా మీరు సింగిల్గానే ఉంటే బాగుంటారు అంటూ అనగా... అవును నేను సింగిల్గానే మరింత మెరుగ్గా కనిపిస్తా అంటూ సల్మాన్ ఖాన్ చెబుతాడు. అంటే మీరిప్పుడు కమిటెడ్ అయ్యారా అంటూ ఆడగా సల్మాన్ ఖాన్ తనలో  తాను నవ్వుకుంటాడు. ఇది చూసిన వారు సల్మాన్ ఖాన్ కమిట్ అయ్యాడు అంటే రానున్న రోజుల్లో పెళ్లిచేసుకోబోతున్నాడా ఏంటి అంటూ చర్చించుకోవటం మొదలుపెట్టారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: