తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగాడు వేణు తొట్టెంపూడి. స్వయంవరం, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, ఖుషీ ఖుషీగా, శ్రీకృష్ణ 2006, యమగోల మళ్ళీ మొదలైంది, గోపి గోపిక గోదావరి.. వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు ఈ సీనియర్ హీరో. అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం స్టార్ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేక పోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఆమధ్య విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'చింతకాయల రవి' సినిమా లో ఓ గెస్ట్ రోల్ లో మెరిసిన వేణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దమ్ము' సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించాడు.

అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన దమ్ము సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దాంతో వేణు కూడా మళ్లీ సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సీనియర్ హీరో. అయితే ఈసారి కథానాయకుడిగా కాకుండా సహాయక పాత్రలోనే కనిపించబోతున్నాడు. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో వేణు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తో పాటు మరో సినిమాలోనూ రవితేజతో కలిసి నటించబోతున్నారు వేణు.

సినిమా పేరే 'ధమాకా'. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట వేణు. ఇప్పటికే ఈ పాత్ర కోసం వేణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ధమాకా సినిమాలో వేణు ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వనుంది చిత్రబృందం. మరి రవితేజ కాంబినేషన్లో వేణు చేస్తున్న ఈ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తనకి ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయో చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాల్లో వేణు పాత్రలు కనుక క్లిక్ అయితే ఆ తర్వాత అతనికి అగ్ర హీరోల సినిమాల్లో చాన్సులు రావడం పక్కా అని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: