బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీగా వసూల్ చేసింది. మేకర్స్ అయితే మాస్‌ జాతర అని సక్సెస్‌ సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఈ మాస్‌ మూవీలో కొంచెం మదర్‌ సెంటిమెంట్‌నీ మిక్స్ చేశాడు బోయపాటి. అమ్మ పాటతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్లాడు. శర్వానంద్‌ కెరీర్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచిన సినిమా 'అమ్మ చెప్పింది'. మదర్‌ సెంటిమెంట్‌కి శర్వా నటన తోడై, ప్రేక్షకులని ఎమోషనల్ జర్నీ చేయించింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత శర్వానంద్‌ మదర్‌ సెంటిమెంట్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రీ కార్తీక్ డైరెక్షన్‌లో 'ఒకే ఒక జీవితం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అమల, శర్వానంద్‌ తల్లీకొడుకులుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన అమ్మపాటకి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

విశ్వక్ సేన్, నరేష్ కుప్పిలి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా 'పాగల్'. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమాకి బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే సినిమా రిజల్ట్‌ కొంచెం అటూ ఇటూ అయినా, ఆల్బమ్‌కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్‌ సాంగ్‌తో పాటు, 'అమ్మా అమ్మా నీ వెన్నెల' పాటకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

కమర్షియల్‌ మూవీస్‌కి భారీ వసూళ్లు వస్తున్నట్లే, మదర్‌ సెంటిమెంట్ మూవీస్‌కీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా డబ్బింగ్‌ సినిమాలు అయితే ఈ సెంటిమెంట్‌తోనే బాక్సాఫీస్‌ని మాయ చేస్తున్నాయి. అమ్మ పాటలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్‌ నంబర్స్‌లోనూ దూసుకెళ్తున్నాయి. కన్నడ స్టార్‌ యశ్‌కి తెలుగునాట క్రేజీ రెస్పాన్స్ తెచ్చిపెట్టిన సినిమా 'కెజిఎఫ్'. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ తెలుగులో కూడా భారీగా వసూల్ చేసింది. కన్నడ సినిమాలు బయటి మార్కెట్‌లో పెద్దగా వసూల్ చెయ్యలేవనే ఒపీనియన్స్‌ని మార్చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిజానికి ఎంత రెస్పాన్స్ వచ్చింది, మదర్‌ సెంటిమెంట్ కూడా అంతమందిని కదిలించింది. తరగని బరువైనా అనే పాటైతే ఫుల్ పాపులర్‌ అయింది.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్‌ యాక్టర్ విజయ్‌ ఆంటోనికి తెలుగులో ఉన్న ఒకే ఒక్క బిగ్గెస్ట్‌ హిట్ 'బిచ్చగాడు'. తమిళంలో 'పిచ్చైకారన్'గా రూపొందిన ఈ సినిమా తెలుగులో 'బిచ్చగాడు'గా డబ్ అయ్యింది. మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా తెలుగులో సూపర్‌ హిట్‌ అయింది. తమిళ్‌ కంటే తెలుగులోనే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చిందని చెప్తారు. ఇక ఈ హిట్‌ తర్వాత విజయ్ ఆంటోని తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ చేశాడు గానీ అంత సక్సెస్ మాత్రం రాలేదు. అజిత్, హెచ్.వినోద్‌ కాంబినేషన్‌లో సంక్రాంతికి రావాల్సిన సినిమా 'వలీమై'. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తెలుగు స్టార్ కార్తికేయ విలన్‌గా చేశాడు. ఇక ఈ మూవీలో కూడా మదర్‌ సెంటిమెంట్‌కి చోటుంది. అమ్మ పాటతో సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా భారీగా ఉన్నాయని ఆడియన్స్‌కి భరోసా ఇచ్చాడు దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: