సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎమ్.బి సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ ఫాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది ప్రస్తుతం. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

నిజానికి ఈ సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. మే 12వ తేదీ వేసవి కానుకగా సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుంచి మొదటి పాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని మొదటి పాటను లిరికల్ వీడియో రూపంలో కాకుండా సరికొత్త విధానంలో అంటే నేపథ్య వీడియో సాంగ్ ల దీన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అంటే పాటలో లిరిక్స్ తో పాటు వీడియో రూపంలో కూడా కొంత భాగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి పాట వాలెంటైన్స్ డే రోజు విడుదల చేస్తున్నారు అంటే కచ్చితంగా అది లవ్ సాంగ్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఆ పాట ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: