మెగా ఫ్యాన్స్ కి ఈ ఏడాది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తమ అభిమాన హీరోని వెండితెరపై చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వివిధ కారణాలతో మెగా హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే మెగా అభిమానులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకబోతోంది. రాబోయే రోజుల్లో మెగాహీరోలు నటిస్తున్న సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్లో బిగ్ మూవీస్ అన్ని విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాటిని బట్టి చూస్తే మరో రెండు నెలల్లో కనీసం ఒక మెగా హీరో అయినా థియేటర్లోకి రాబోతున్నాడు. ముందుగా వరుణ్ తేజ్ ఈ మెగా ట్రీట్ ని ప్రారంభించబోతున్నారు. అతను హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'గని' ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న విడుదల కాబోతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ కానుంది. ఇక అతని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా  విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కూడా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇంతలోనే మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ మార్చి 25న విడుదల కానుంది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' కూడా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు వరుణ్ తేజ్ మరో చిత్రం 'ఎఫ్ 3' ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలన్నీ అనుకున్న విడుదల తేదీల ప్రకారం వస్తాయా? లేదా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అనుకున్న సమయానికి వస్తే వచ్చే మూడు  నెలలు మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ  అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇప్పటి నుంచి చూసుకుంటే వచ్చే మూడు నెలలపాటు ప్రతి నెల తమ అభిమాన హీరోను వెండితెరపై చూస్తూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం మీద వచ్చే మూడు నెలలు మొత్తం బాక్సాఫీస్ వద్ద మెగాహీరోల హవానే ఉండబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: