సినిమా ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా అతనికి ఏదో ఒక చిన్న సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఆ సెంటిమెంట్ ని ఫాలో అయితే కచ్చితంగా విజయాన్ని అందుకోవచ్చని కొందరు సెలెబ్రిటీలు ప్రగాడంగా నమ్ముతుంటారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ కోవకు చెందినవారే. టాలీవుడ్ లో అగ్ర దర్శకునిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల విషయంలో చాలా సెంటిమెంట్స్ ని ఫాలో అవుతారు. మరి అది సెంటిమెంటా లేక ఆయనకున్న అలవాటా అనేది తెలియదుగానీ..

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకుని ఆ స్టార్ హీరోయిన్ తో వరసగా మూడు సినిమాలను చేస్తూ ఉంటాడు. ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా ఆ హీరోయిన్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు. అలా ఉదాహరణ తీసుకుంటే.. పవర్ స్టార్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'సన్నాఫ్ సత్యమూర్తి'  సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా సమంతనే హీరోయిన్. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన 'అఆ' సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా కనిపించింది. ఇక ఇప్పుడు బుట్ట బొమ్మ పూజ హెగ్డే విషయంలో కూడా అదే చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఈయన దర్శకత్వం వహించిన 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అల వైకుంటపురంలో' సినిమాలో కూడా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఇక ఇప్పుడు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మహేష్ బాబు సినిమాతో పూజా హెగ్డే ని పక్కన పెట్టేసి తన తర్వాత సినిమాలో కొత్త హీరోయిన్ ఎవరైనా తీసుకుంటాడా? లేక మళ్లీ పూజ హెగ్డే ని రిపీట్ చేస్తాడా అనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: