'జాతిరత్నాలు' సినిమాతో స్టార్ హీరోకి వచ్చినంత క్రేజ్ తెచ్చుకున్నాడు అనుదీప్. ప్రమోషనల్ ఈవెంట్స్‌లో అందరినీ డామినేట్ చేసి యాక్టింగ్‌లోకి వస్తాడా అనే డౌట్స్ క్రియేట్ చేసిన అనుదీప్ ఇప్పుడు కోలీవుడ్‌కి వెళ్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ బైలింగ్వల్ తీస్తున్నాడు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తెలుగు నుంచి తమిళ్‌కి వెళ్లాలనుకుంటోన్న దర్శకులకి ఫస్ట్ ఆప్షన్‌గా మారిపోయాడు ధనుష్. కోలవెర్రి సాంగ్‌తో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ధనుష్‌కి 'రఘువరన్ బీటెక్, మారి' సినిమాలతో తెలుగులో స్టార్డమ్ కూడా వచ్చింది. ఈ మార్కెట్ లెక్కలతోనే ధనుష్‌తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్స్ తీస్తున్నారు. ఇప్పటికే డీ శేఖర్ కమ్ముల ధనుష్‌తో ఒక సినిమా అనౌన్స్ చేస్తే, రీసెంట్‌గా వెంకీ అట్లూరి ఈ హీరోతో 'సార్' సినిమా ప్రకటించాడు.
వంశీ పైడిపల్లి 'మహర్షి' తర్వాత మళ్లీ మహేశ్ బాబుతోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే కొంత గ్యాప్ తర్వాత కోలీవుడ్‌కి వెళ్ళాడు. విజయ్‌తో మల్టీలింగ్వల్ మూవీ అనౌన్స్ చేశాడు. ఇక విజయ్ చాన్నాళ్లుగా తెలుగులో స్టార్డమ్ సంపాదించాలని ట్రై చేస్తున్నాడు. 'విజిల్, మాస్టర్' ఓకే అనిపించుకున్నా సూర్య, కార్తి రేంజ్ మార్కెట్ రావడం లేదు. దీంతో టాలీవుడ్‌లో జెండా పాతాలని వంశీ పైడిపల్లి మూవీతో తెలుగు మార్కెట్‌కి వస్తున్నాడు. మొత్తానికి తెలుగు దర్శకులు, తమిళ హీరోల మధ్య ఒప్పందాలు బాగానే కుదురుతున్నాయి. తమ మార్కెట్ ను పెంచుకునేందుకు కోలీవుడ్ హీరోలు మంచి ప్లానే వేస్తున్నారు.