కరోనా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది. దీని తీవ్రత ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతోంది. ఇది మిగిల్చిన విషాదాన్ని తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. ఎందరో పిల్లలు తమ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోయారు. అలాగే తల్లితండ్రులు కూడా చేతికి అంది వచ్చిన బిడ్డలను పోగొట్టుకుని జీవచ్ఛవాలుగా బ్రతహుకును వెళ్లదీస్తున్నారు. సినీ రాజకీయ నాయకులలో సైతం ఎందరో ఈ కరోనా మహమ్మారి బారిన పడి అర్ధాంతంరంగా జీవితాలను పోగొట్టుకున్నారు. అయితే తాజాగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ప్రస్తుతం హాస్పిటల్ లో ప్రాణం కోసం పోరాడుతోంది.

జనవరి నెలలో 11 వ తేదీన లతా మంగేష్కర్ కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో జాయిన్ అయింది. కుటుంబ సభ్యులు మరియు అభిమానులు సాధారణంగా అందరికీ కరోనా వస్తోంది ఈమె కూడా అదే విధంగా వెంటనే కోలుకుంటుంది అని భావించారు. కానీ ఈమెకు పరిస్థితి అందుబాటులోకి రాలేదు. లక్షణాలు ఎక్కువగా ఉండడంతో కుటుంబ సభ్యలు భయపడి ముంబైలోని బ్రేఅక్ క్యాండీ హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. ఆ రోజు నుండి నిన్నటి వరకు ఈమె ఆరోగ్యంపై కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదని హాస్పిటల్ డాక్టర్స్ చెబుతో వచ్చారు. కానీ రోజులయ్యే కొద్దీ లతా మంగేష్కర్ శరీరం ట్రీట్ మెంట్ కు సహకరించడం లేదని తెలుస్తోంది.

దీనితో విషయం బాగా తీవ్రమయ్యి వెంటిలేటర్ మీద చికిత్స ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే డాక్టర్ ప్రతీత సంతానీ తెలిపాడు. దీనితో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర భయానికి లోనవుతున్నారు. అయితే ఇప్పటి నుండి ఏమి చెడు వార్త వినాల్సి వస్తుందో అని అంతా దుఃఖంతో ఉన్నారు. భగవంతుడు ఈమెను ప్రాణాపాయం నుండి తప్పించి క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరుకుందాం. ఇక అంతా ఆ దేవుని మీదనే భారం వేసి ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: