తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు తాము చేసే సినిమాల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా చూసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా కూడా వారికి భారీ స్థాయిలో నష్టం తీసుకువస్తుంది సదరు సినిమా. ముఖ్యంగా తమకు జోడిగా నటించే హీరోయిన్ ల విషయంలో ఎంతో కేర్ తీసుకోవాలి. ఎవరితో నటిస్తే తమ సినిమాకు తమకు తమ కెరియర్ కు ఎక్కువగా ఉపయోగపడుతారో అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు వారి జోడి అభిమానులు నచ్చేలా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

అలాగే ఆ హీరోయిన్ కు టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో క్రేజ్ కూడా ఉండాలి. నటనలో గ్లామర్ లో అన్నింట్లోనూ హీరోయిన్ ది బెస్ట్ అనిపించుకోవాలి. అప్పుడే పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ ఇద్దరు హీరోయిన్ లు మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంటూ రిపీటెడ్ గా హీరోలతో నటిస్తూ ఉన్నారు. వారే పూజా హెగ్డే మరియు రష్మిక మందన. నటన విషయంలో హీరోలకు ఏమాత్రం సరిపోని విధంగా నటిస్తారు ఈ ముద్దుగుమ్మలు.  అలాగే గ్లామర్ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలకు సైతం భారీ స్థాయిలో పోటీ ఇస్తారు.  

ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ 1 నెంబర్ 2 స్థానాలలో వీరిద్దరు మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు. దాంతో హీరోలు వీరిద్దరితో మాత్రమే నటిస్తూ కొంత బోర్ కొట్టిస్తున్నారు. దాంతో కొత్త గా ట్రై చేయాలని మన హీరోలు ఇతర భాషల నుంచి హీరోయిన్లను అరువు తెచ్చుకుంటున్నారు. మరి ఎందుకు టాప్ హీరోయిన్ లుగా కొంతమంది హీరోయిన్లు ఎదగలేదో అర్థం కావడం లేదు కానీ ఈ ఇద్దరు మాత్రం భారీ స్థాయిలో అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు అని చెప్పవచ్చు. పూజా హెగ్డే మరొకసారి మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న గా రష్మిక మందన కూడా మంచి అవకాశాలను అందుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: