యూట్యూబ్ లో ఓ చానల్ ద్వారా బాగా ఫేమస్ అయిన సరయు బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. తన షార్ట్ ఫిలిమ్స్ లో లాగానే బిగ్ బాస్ హౌస్ లో కూడా బూతు పురాణం మొదలు పెడుతుంది అని అందరూ అనుకున్నారు అందరికీ తెలిసిన సరయు లాగా కాదు బిగ్బాస్ హౌస్లో కాస్త సాఫ్ట్ గా కనిపించింది. అబ్బే ఇదంతా మనకు వర్కౌట్ అయ్యేలా లేదు అనుకున్నారో ఏమో అభిమానులందరూ ఓట్లు వేయకుండా ఆమెను బయటకు తీసుకొచ్చేశారు. ఇంతకీ ఇప్పుడు సరయు గురించి ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చింది అని అంటారా..
ఇటీవలే బిగ్బాస్ కంటెస్టెంట్ సరయూ పై పోలీసు కేసు నమోదయ్యింది. దీంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఒక హోటల్ ప్రచార పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సరయు వ్యవహరించిందంటూ ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేవూరి అశోక్ యూట్యూబర్ సరియు పై కేసు పెట్టడం గమనార్హం. సరయు తో పాటు మరికొంతమంది గణపతి బొప్పా మోరియా బ్యాండ్ లను తలకు ధరించి మద్యం సేవించాలని దేవుడు బొమ్మలను దర్శించుకుని మద్యం సేవించి హోటల్స్ కి వెళ్తారు అనే సంకేతాన్ని ఈ పాట ద్వారా ఇస్తున్నారంటూ ఆరోపించారు చేవూరి అశోక్. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో కోరారు. కాగా రాజన్న సిరిసిల్ల పోలీసులు బంజార హిల్స్ పోలీస్ స్టేషన్ కు ఈ కేసును బదిలీ చేయడం గమనార్హం.