గత సీజన్ వరకూ బిగ్ బాస్ అందరినీ ఆకర్షించింది.. టాప్ రియాలిటీ షో గా అందరి కి బాగా నచ్చింది. ఇప్పటి వరకూ జంటలను కలిపిన ఈ షో ఇప్పుడు విడగొట్టింది..ఆనందంగా సాగుతున్న ఇద్దరు లవర్స్ ను  బిగ్ బాస్ విడదీసింది. స్క్రీన్ మీద సిరి, షణ్ముఖ్‌ ల రొమాన్స్ చూసి దీప్తి సునయన బాగా భాద పడింది. అంతేకాదు తన గురించి మార్చిపోయి షణ్ముఖ్ ప్రవర్థించాడని ఫీల్ అయ్యింది.దాంతో అతనికి దూరంగా ఉండాలని అనుకుంది. అంతేకాదు అతనికి బ్రేకప్ కూడా చెప్పెసింది.


బిగ్ బాస్ షో లో ఆమె లవర్ వేరెవరి కో ముద్దులు పెడుతుంటే చూసి తట్టుకోలేకపోయింది. అదే అతడి కొంప ముంచింది. అది తెలుసుకొక అతను రెచ్చిపోయాడు. షో లో పాపులర్ అవ్వడానికి సిరి తో మరింత చనువుగా మారాడు. దాన్ని చూసిన దీప్తి సునయన అతని తో రిలేషన్ కు గుడ్ బై చెప్పింది.
ఆ బాధ భరించలేని షణ్నూ మధ్య మధ్య లో ఏవో పోస్టులు పెడుతూ తనని తాను ఓదార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దీప్తి మనసు మాత్రం కరగలెదు. అతనికి దూరంగా ఉంటుంది.


ఇది ఇలా ఉండగా.. స్టార్ మా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమం లో షన్ముఖ్ అతని పరిస్థితి కి తగ్గట్లు డ్యాన్స్ చేశాడు. ఆర్య2లో ఈ పాటకు అల్లు అర్జున్ చేసిన స్టెప్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా షణ్నూ కూడా చేశాడు.. అది అల్లు అర్జున్‌ని మించి పోయేలా చేశాడనిపిస్తుంది. షణ్నూ అభిమానులు కచ్చితంగా ఆ మాట అంటారు. షో లో యాంకర్ రవి అతణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అది కాస్త షో కి హైలెట్ అవ్వనుంది. మిగితా విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 14 న ఆ షో ను చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: