స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే ఏ హీరో జాతకం అయినా గాని మారుతుందనే విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలను ఎంతో పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతారు

రాజమౌళి సినిమాలో విలన్ గా నటిస్తే కూడా వరుస సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. తన సినిమాల ద్వారా జక్కన్న ఎంతోమంది విలన్లను పరిచయం చేశారనే విషయం తెలిసిందే.

మరోవైపు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ తో బాగా బిజీ అవుతున్నారు. లెజెండ్ మరియు రంగస్థలం అలాగే అరవింద సమేత సినిమాలలో క్రూరమైన విలన్ పాత్రలను జగపతి బాబు అద్భుతంగా పోషించారు. రాజమౌళి సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తే జగపతి బాబు కెరీర్ ఇంకా పుంజుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో జక్కన్న సినిమాలో విలన్ రోల్ లో నటించకపోవడానికి గల కారణాన్ని జగపతిబాబు చెప్పుకొచ్చారట.

ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ నేను ఎప్పుడూ టైమ్ ను నమ్ముతానని అన్నారట చాలామంది ఫ్లాపుల్లో టైమ్ బాలేదని అంటారని అయితే టైమ్ ముందుకు నడిపిస్తుందని జగపతిబాబు అన్నారట.. ఒకప్పుడు తాను ఫుడీ అని ఇప్పుడు ఆల్కహాల్ కు కూడా దూరంగా ఉన్నానని ఆయన వెల్లడించినట్లు సమాచారం.. వచ్చే జన్మకు కూడా తాను తాగేశానని అందుకే ఆల్కహాల్ కు కూడా నేను దూరంగా ఉన్నానని జగపతిబాబు వెల్లడించారు.

బోయపాటి శ్రీను బంగారం అని జగపతిబాబు కామెంట్లు చేశారట . రాజమౌళి గురించి అందరికీ తెలుసని ఆయన గురించి చెప్పేదేం లేదని జగపతిబాబు పేర్కొన్నారట. ఆయన సినిమాల్లో అన్ని పాత్రలకు మొదటి నుంచి చివరి వరకు ఫుల్ ఫిల్ నెస్ ఉంటుందని జగపతిబాబు కామెంట్లు కూడా చేశారు. రాజమౌళి కొడుకు కార్తికేయ తన తమ్ముడి కూతురిని పెళ్లి చేసుకున్నారని నాకు రాజమౌళి వియ్యంకుడు అవుతారని జగపతి తెలిపారట.పెళ్లైన తర్వాత రాజమౌళి తనతో ఎందుకో మిమ్మల్ని విలన్ గా పెట్టుకోలేకపోతున్నానని అన్నారట మీరు మరీ అందంగా ఉంటారో లేక మీ మంచితనం వల్లో విలన్ రోల్ లో పెట్టుకోలేదని అన్నారని జగపతిబాబు తెలిపారు. తాను విలన్ రోల్స్ మాత్రమే కాదని ఎలాంటి రోల్స్ అయినా చేస్తానని ఆయనతో అన్నానని జగపతిబాబు చెప్పుకొచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: