టాలీవుడ్
సినిమా పరిశ్రమలో నెంబర్ వన్
సంగీత దర్శకుడిగా ఉన్న
దేవిశ్రీ ప్రసాద్ ఓ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు అంటే ఆ చిత్రం తప్పకుండా సంగీతం పరంగా భారీ హిట్ అవుతుందని చెప్పాలి. పెద్ద హీరోలకు మాత్రమే కాదు చిన్న హీరోలకు సైతం అందరూ మెచ్చే సంగీతాన్ని సమకూరుస్తాడు దేవిశ్రీప్రసాద్. తనదైన స్పెషాలిటీ చూపిస్తాడు. ఇటీవలే ఆయన సంగీతం అందించిన పుష్ప ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ
సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి కారణం
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా.
ఆ చిత్రానికి అద్భుతమైన పాటలు ఇవ్వడం మాత్రమే కాకుండా అందరూ మెచ్చే నేపథ్య సంగీతాన్ని కూడా ఎంతో అమోఘంగా అందించి తనకు సాటి ఎవరూ లేరని మరొకసారి నిరూపించుకున్నాడు దేవిశ్రీప్రసాద్. ఇకపోతే ఆయనకు మరొక
సంగీత దర్శకుడు
తమన్ రూపం లో భారీ స్థాయిలో పోటీ ఉన్నా కూడా తనకే సొంతమైన సంగీతం తో ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ముందుకు దూసుకు పోతున్నాడు. ఆ విధంగా ఆయన తాజాగా
రవితేజ హీరోగా నటించిన కిలాడి ఈ సినిమాకు సంగీతం అందించి ఈ చిత్రం పై భారీ క్రేజ్ వచ్చేలా చేశాడు అని చెప్పవచ్చు.
ఈ
సినిమా పాటలు టీజర్ తోనే చిత్రంపై భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది అంతేకాదు టీజర్ కు ట్రైలర్ కు ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఒక్కసారిగా
సినిమా పై మరింత ఆసక్తిని కలుగజేసింది. అలా ఈ చిత్రానికి సంబంధించిన నేపధ్య సంగీతం విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా
దేవిశ్రీప్రసాద్ మరొకసారి తన టాలెంట్ అంతా ఉపయోగించి ఈ అద్భుతమైన
సినిమా చేశాడని చెప్పవచ్చు. వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న
దేవిశ్రీప్రసాద్ ఖాతాలో ఇప్పుడు ఈ
సినిమా విజయం కూడా చేరడం ఆయనకు ఆయన ప్రతిభకు నిదర్శనం. మరి భవిష్యత్తులో ఇంకెన్ని
సినిమా లతో
దేవిశ్రీప్రసాద్ తన ప్రతిభను నిరూపించుకుంటాడో చూడాలి.