మరొకరిది 40 ఏళ్ల ఇండస్ట్రీకి సంబంధించిన అనుభవం
ఒకరు పొలిటికల్ స్టార్ మరొకరు మెగా స్టార్
ఒకరు శాసిస్తే మరొకరు అర్థిస్తున్నారు
అదే నిన్నటివేళ ఇబ్బంది
ఆయన పునాది రాళ్లపై ఎందరో నిలబడ్డారు.ఆయన ప్రాణం ఖరీదు సినిమా చేశాక ఇంకొందరు ఆ విధంగా రాణించేందుకు పరితపించారు.తీపి,చేదుల జీవితంతో ఆయన యుద్ధం చేశారు.ఆయన తెలుగు సినిమా తార.నడిచే తార..ఎవర్ గ్రీన్ స్టార్ ఆయనే చిరంజీవి.ఆయనేం మాట్లాడినా సెన్సేషనే.! కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం..ఎందరో తమ్ముళ్లకు అభిమాన రూపం..ఆయనే చిరంజీవి. ఎన్నోకష్టాలను దాటాక ఆయన పద్మ భూషణ్ అయ్యారు.ఎన్నో కష్టాలు ఓర్చి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.ఆయనే చిరంజీవి. జీవితంలో ప్రగతి సోపానానికి సంకేతిక..పరిశ్రమించే వారికి ఓ గొప్ప ప్రతీక ఆయనే..ఇంకా చెప్పాలంటే ఆయనే ఓ గెలుపు పతాక.
కానీ ఇప్పుడు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఆయన చేతులు జోడించి సినిమా పరిశ్రమ కోసం అర్థిస్తున్నారు.అస్సలు బాలేదు. సర్ మీరు మా సమస్యలు తీర్చండి అని ప్రాథేయపడుతున్నారు.ప్రార్థిస్తున్నారు.ఎన్నో అవరోధాలు దాటి ఇంతటి వాడయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన వినయం కారణంగా మరింత వంగి,వంగి నమస్సులు చెబుతున్నారు ఏపీ సీఎంకు! ఇది అస్సలు బాలేదు.ఆయన వేరు సర్ ఆయన స్థాయి వేరు..నాలుగు రోజులు ఆగితే కొత్త ప్రభుత్వాలు వస్తాయి అప్పటిదాకానే ఈ కష్టాలు అని అనుకుంటే అయిపోతుంది.అలా కాకుండా నాకెందుకు అని అనుకుంటే సమస్య జఠిలం అయిపోతుంది.
కానీ చిరు ఎన్నో మెట్లు దిగివచ్చారు.ఎందరో ఆకలి కన్నీళ్లు అర్థం చేసుకున్న వ్యక్తిగా తీర్చిన వ్యక్తిగా సర్ మీరు మాపై దయ ఉంచాలి..మీరు తల్లిలాంటి స్థానంలో ఉన్నారు అని అర్థించారు. ఆ పని ఇండస్ట్రీ అంతా కలిసి చేయాలి.కొందరు స్టైలిష్ గా ఇంగ్లీషులో మాట్లాడి బయటకు వచ్చారు.మీడియా ఎదుటకూడా అంతే స్టైలిష్ గా చొక్కా నలిగిపోద్దా అన్న విధంగా బిహేవ్ చేశారు కానీ చిరు మాత్రం లోపల మరియు బయట ఒకే విధంగా ఉన్నారు. ఇది ఓ విధంగా బాధాకరం.
చిరుస్థాయిలో అడిగే నైజం ఇది కాదు.ఆయన అడగడం కాదు శాసించాలి.శాసించే స్థాయి అతనిది.సింహం వచ్చి అన్నం పెట్టండి అని అడగడం ఏం బాలేదు.సింహం వచ్చి జూలు విదిల్చి పంజా విసిరి కొట్టాలి కానీ ఇలా మరీ! వెనక్కు తగ్గి వేట మరిచిపోయిన మృగరాజులా ప్రవర్తించడం బాలేదు.చిరూ సర్ మీకు మీరు నచ్చి ఉండవచ్చు కానీ మాకెందుకో నచ్చలేదు.ఇకపై ఇలా చేయకండి.అయినా మీకెందుకు సర్ మీరేమయిన మా అధ్యక్షులా..పోనీ ఇండస్ట్రీ మీకేమయినా పదవులు ఇచ్చిందా? అయినా మీకెందుకు సర్..నాల్గు రోజులు ఆగితే ఇదే మనుషులు మిమ్మల్ని తిట్టైనా తిడతారు..మీపై అభాండాలు వేసైనా వేస్తారు.. బండరాళ్లు విసిరి నవ్వి వెళ్తారు..వీరు మనుషులు వీళ్లను మీరు నమ్మొద్దు ప్లీజ్......