ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడని అందరికి తెలుసు.. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం ఘన విజయం సాధించింది.

సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి. దీనితో పుష్ప పార్ట్ 2ని పార్ట్ 1 కి మించేవిధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.. పుష్ప చిత్రంతో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని నిలబెట్టుకోవడం పైనే ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టంతా ఉందట.


పుష్ప 2ని ప్రారంభించే ముందు అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు అలాగే హోమం నిర్వహించబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్యుల ఆధ్వర్యంలో ఈ హోమం జరగబోతున్నట్లు సమాచారం.పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమా ప్లానింగ్ భారీ స్థాయిలో ఉండబోతోందట.

సో భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండాతన జ్యోతిష్యం ప్రకారం అల్లు అర్జున్ ఈ హోమం నిర్వహించనున్నాడని తెలుస్తుంది.. అల్లు అర్జున్ సన్నిహితులు అతడికి హోమం చేయాలని సూచించినట్లు సమాచారం. జీవిత ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా మరియు సంతోషంగా సాగిపోవాలంటే కొన్ని హోమాలు మరియు యజ్ఞయాగాలు చేస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని జ్యోతిష్యలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి బన్నీ కూడా రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్ లో పూజలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారుట. `పుష్ప-2` మ్యూజిక్ సెషన్ కంటే ముందుగానే ఈ తంతు మొత్తం పూర్తిచేయాలని భావిస్తున్నారుట వారు.. ఇలాంటి పూజల ద్వారా బన్నీకి దిష్టిదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్నది ఓ కారణంగా చెప్పొచ్చు.

పుష్పలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటించాడని కూలీగా మొదలై స్మగ్లింగ్ సిండికేట్ కి డాన్ గా ఎలా మారాడు అనేది మొదటి భాగంలో చూపించారట.ఇక పార్ట్ లో డాన్ గా ఎదిగిన అల్లు అర్జున్ కి.. పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ కి మధ్య పోరాటం ఏవిధంగా ఉండబోతోంది అనేది బాగా చూపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: