ఇక తన సినీ కెరీర్లో సాఫ్ట్ క్యారెక్టర్లను మాత్రమే కాకుండా వైలెంట్ క్యారెక్టర్లను కూడా చేయగలడని అంతఃపురం, గాయం వంటి సినిమాలలో చేసి నిరూపించాడు.. ఇక ఆ తర్వాత సినిమాలు తీస్తే పరాజయాలు కావడంతో సినిమా అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో విలన్ వేషాలు వైపు తన మనసుని మళ్ళించాడు. మొదటగా విలన్గా నటించడానికి కాస్త కష్టంగా అనిపించినా ఆ తరువాత హీరోల ను మించి స్టార్ రేంజ్ ను అందుకున్నాడు జగపతిబాబు.
ఎన్నో సినిమాలలో ఫాదర్ క్యారెక్టర్లు చేస్తూ, మరొకవైపు ప్రతినాయక పాత్రలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయాడు. జగపతి బాబు తన కళ్ళు, వాయిస్ తోనే విలన్ పాత్రలను హైలెట్ చేస్తూ నిలబడ్డాయి. జగపతిబాబు రాకముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇతర భాషలలోని విలన్స్ పై ఆధారపడి ఉండేవారు.. ఇక జగపతి బాబు ఎంట్రీ ఇవ్వడం తో ఆయన దగ్గరకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఇతర భాషలలో సైతం విలన్గా బిజీగా మారిపోయాడు జగపతిబాబు.. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. హీరోగా కంటే విలన్ గానే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు జగపతిబాబు. ఈ రోజున తన 60వ పుట్టినరోజు కావడం గమనార్హం.సినిమా ఇండస్ట్రీలోకి నాగార్జునను చూసి ఇండస్ట్రీలోకి వచ్చాడు అంట జగపతిబాబు.ఇందుకు గల కారణం వీరిద్దరూ స్నేహితులు కావడం