సౌత్ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టులో 'కే జి ఎఫ్ 2' కూడా ఒకటి. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాతో కన్నడ హీరో యాష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన కే జి ఎఫ్ 2 టీజర్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది. యూట్యూబ్లో ఈ టీజర్ ఏకంగా 230 మిలియన్ లకు పైగా వ్యూస్ను అందుకొని సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే తొలి సినిమా ఇదే కావడం విశేషం. రాజమౌళి బాహుబలి రికార్డ్ సైతం దాటి ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. అయితే ఈ సినిమా టీజర్ విడుదలై చాలా రోజులు అయిపోయింది.

అయినా ఇప్పటివరకు సినిమా నుంచి మరో అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు అభిమానులకి ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా నుండి మొదటి పాటను 25న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. ఇక ఈ పాట కూడా తెలుగుతో పాటు తెలుగు, మలయాళం, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో యశ్ కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే పతాకంపై విజయ్ కిరందుర్ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: