మహేష్, కీర్తి సురేష్ జంటగా సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇక ఈ సినిమాను సమ్మర్ కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్స్ ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చూశారు.. కానీ అందుకు సంబంధించి ఒక వీడియో లీక్ కావడంతో దీంతో మైత్రి బ్యానర్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఇక అంతే కాకుండా మహేష్ అభిమానులు కూడా చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


తమన్  ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాను మనసైతే చాలా బాధగా ఉంది.. ఆరు మాసాల నుంచి ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాను.. రాత్రి పగలు అనుకొకుండ పనిచేశాం..తనతో పాటు లిరిక్ రైటర్, మ్యూజిక్ రికార్డింగ్, డైరెక్టర్, నిర్మాత మరికొంతమంది కష్టపడ్డారని తెలియజేశాడు. ఇక ఈ పాట రికార్డింగ్ చేసే సమయంలో తొమ్మిది మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయినా ఇలాంటివి లెక్కచేయకుండా హీరో పై ఉన్న ప్రేమతో తాము కష్టపడ్డామని తెలియజేశారు. ఇక ఈ పాట కోసం వరల్డ్ లోనే ఒక ఫేమస్ బెస్ట్, ప్లేస్ మాస్టర్ మిక్సింగ్ టెక్నాలజీని వాడామని తెలియజేశాడు.


అలా ఎంతో కష్టపడి చేసిన ఈ పాటను ఎవరు వెధవ చాలా సులువుగా వీటిని చేశాడు.. వానిపై ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. వాడికి పని చేస్తే మాకు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదని తెలియజేశాడు. ఈ విషయం తెలిసి తనకు ఎంతో హార్ట్ బ్రేకింగ్ అయ్యిందని తెలియజేశాడు. లైఫ్ లో ఎన్నో ఎదుర్కొన్నాను కానీ ఈ విషయం తనను ఎంతో బాధిస్తోంది అని తెలియజేశాడు. అంతేకాకుండా వైరస్ విడుదల చేయడం ఎంత ఘోరమో వాడికి తెలియాలి అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: