తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎన్నో ఆశలతో వచ్చి భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించి గుర్తింపు దక్కించుకోవాలని చాలా మంది హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. ఆ విధంగా మంచి టాలెంట్ మరింత అభినయం కలిగి ఉన్న లావణ్య త్రిపాటి మంచి సినిమాలు చేస్తున్న కూడా అదృష్టం ఏమాత్రం కలిసి రాకపోగా ఆమె ఇంకా చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది. 2012వ సంవత్సరం అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు పరిచమైంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత మంచి మంచి సినిమాల్లో నటించింది. భలే భలే మగాడివోయ్ సినిమా ఆమెకు మొదటి కమర్షియల్ విజయాన్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే అక్కడి నుంచి ఆమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తిప్పి కొట్టడంతో ఆమె కెరీర్ మరింత దుర్భరంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన చావుకబురు చల్లగా సినిమా కూడా ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు.

దాంతో ఈ ముద్దుగుమ్మ ఏం చేయాలో పాలుపోక లేకుండాపోయింది. ఇతర భాషలలో ప్రయత్నాలు చేద్దామంటే అక్కడ కూడా ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంపై ఆమె భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకుంది. దానికి తోడు ఆమె పై ఇటీవల వస్తున్న రూమర్స్ కూడా ఆమె కెరీర్ను మరింత దిగజార్చుతున్నాయి. ఓ మెగా హీరోతో ఎఫైర్ ఉందని వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠీ సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలను చేస్తుందో చూడాలి. ఇతర భాషలలో కూడా ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈమె కష్టానికి ఫలితం అందుతుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: