స్వయంకృషితో
సినిమా పరిశ్రమలోకి వచ్చి భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్నాడు నాచురల్ స్టార్ నాని. సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు కాబట్టే ఆయనకు ఈ విధమైన బిరుదు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ
హీరో ఇప్పుడు ప్రేక్షకులను నిరాశ పరిచే సినిమాలు చేస్తున్నాడు. తనకు భారీగా ఫ్లాప్ వచ్చి ఇమేజ్ తగ్గిన సమయం లో ఇటీవల చేసిన
శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పరవాలేదు అనిపించుకునీ
సినిమా హిట్ సంపాదించుకున్నాడు .
ప్రస్తుతం మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన హీరోగా అంటే సుందరానికి అనే
సినిమా చేస్తున్నాడు. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ శ్రియా
హీరోయిన్ గా నటిస్తున్నడం విశేషం. ఆ విధంగా
జంధ్యాల కామెడీ
సినిమా స్టైల్ లో రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా తనకు మంచి పేరు తీసుకువస్తుందని భావిస్తున్నాడు నాని. ఇక ఆ తర్వాత
దసరా అనే వినూత్నమైన సినిమాను కూడా ఆయన చేస్తున్నాడు. ఈ విధంగా వరుస మంచి కథా కథనాలతో ఈ
సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడనే బాధా ఆయన లో ఉందట.
ఒకటా రెండా ఏకంగా గత ఆరేడు సినిమాల నుంచి ఆయన వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే వచ్చాడు. తప్పకుండా సదరు
సినిమా హిట్ అవుతుందని భావించిన ప్రతి సారి కూడా
నాని ఆ చిత్రాన్ని ఫ్లాప్ చేయడం ఆయన అభిమానులకు సైతం ఏ మాత్రం నచ్చలేదు. దాంతో ఇప్పుడు చేయబోయే ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆయన డిసైడయ్యారు. ఓ వైపు హీరోలు అందరూ కూడా సినిమాలతో దూసుకుపోతుంటే
నాని మాత్రం కొట్టడానికి ఆపసోపాలు పడడం అభిమానులకు అవమానకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండు సినిమాల తరువాత ఆ సినిమాలు చేసే విధంగా ముందుకు పోవాలని సలహాలు సూచనలు ఇస్తున్నారు.