ఆ మూవీలో ప్రియమణి మధ్య తరగతి గృహిణి పాత్రలో నటించారు. ఇక భామాకలాపం సక్సెస్ తర్వాత ప్రియమణి తన పారితోషికాన్ని ఊహించని స్థాయిలో పెంచింది. అయితే దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం నటిగా ప్రియమణి కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె ఒకవైపు స్టార్ హీరోలకు మరోవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చిన తరువాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని రకాల పాత్రలను పోషిస్తూ నటిగా సినిమా సినిమాకు ప్రియమణి క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.
ఇక వివాహము తరువాత ప్రియమణి వరుసగా ఆఫర్లతో బిజీగా ఉండటం గమనార్హం అనే చెప్పాలి మరి. అయితే భామాకలాపంకు ముందు ప్రియమణి రోజుకు లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రియమణి పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాక.. ట్రావెలింగ్, అసిస్టెంట్ ఖర్చులు రెమ్యునరేషన్ కు అదనమని తెలుస్తోంది.
అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత అభినయానికి గుర్తింపు ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రియమణి ప్రశంసలతో పాటు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను తీసుకుంటూన్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాసినిమాకు ప్రియమణికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి వెబ్ సిరీస్ లలో, వెబ్ మూవీలలో నటించడానికి ప్రియమణికి కళ్లు చెదిరే స్థాయిలో ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.