మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే  కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.మ్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. 

ఇక తాజా సమాచారం ప్రకారం చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాను హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఇక ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. అయితే  ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇక పెన్ సంస్థ గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ ఏమని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది.అయితే స్ట్రయిట్ హిందీ సినిమాలు ‘గంగుభాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కాబోతోంది.  

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నా రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఆర్.ఆర్ ఆర్ హిందీలోనూ మార్చి 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత   ‘అటాక్ పార్ట్ 1’ను ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నారు. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు ‘జెర్సీ’ హిందీ రీమేక్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఇక దీంతోపాటు  ‘ఆచార్య’ హిందీ వర్షెన్ ను 29న విడుదల చేస్తున్నామని పాన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. అయితే ‘ఆచార్య’ను మిగిలిన సౌతిండియన్ లాంగ్వేజెస్ లోనూ అదే రోజున రిలీజ్ చేసే విషయాన్ని నిర్మాతలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: