సాధారణంగా యువకుల వేగం ముందు సీనియర్లు చాలా స్లో అవుతారు. స్టార్డమ్‌ లెక్కలు, కాంబినేషన్‌ ఈక్వేషన్స్‌తో నెమ్మదిగా సినిమాలు చేస్తారని ఒక ప్రచారం ఉంది. కానీ మెగాబ్రదర్స్‌ ఈ ఒపీనియన్‌ని తలకిందులు చేస్తున్నారు. యంగ్‌స్టర్స్‌ కంటే చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ అన్నదమ్ముల దూకుడు చూసి మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.  

మెగా కుటుంబంలో అరడజను వరకు యువ హీరోలున్నారు. కానీ వాళ్లందరికంటే చిరంజీవి ఫుల్ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. యంగ్‌స్టర్స్‌ అంతా ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే ఆలోచనలో ఉంటే చిరంజీవి మాత్రం ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే నాలుగు సినిమాలు క్యూలో పెట్టేశాడు. 'ఆచార్య' షూటింగ్‌లో ఉండగానే మూడు సినిమాలకి సంతకాలు పెట్టేశాడు.  

చిరంజీవి ఇప్పటికే మూడు సినిమాలు మొదలుపెట్టాడు. మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తమిళ హిట్‌ 'వేదళం' రీమేక్‌గా వస్తోంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్‌ ఫాదర్' చేస్తున్నాడు. ఈ మూవీ మళయాళీ హిట్ 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతోంది. అలాగే బాబీ దర్శకత్వంలో ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. చిరంజీవి రీసెంట్‌గానే యంగ్‌డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  అలాగే చాలా రోజుల క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని ప్రకటన చేశాడు. కానీ త్రివిక్రమ్‌ టాప్ స్టార్స్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు చిరంజీవి లిస్ట్‌లో నాలుగు సినిమాలున్నాయని చెప్పొచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ అయితే ఎవరూ ఊహించని రేంజ్‌లో సినిమాలకి సైన్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొక ప్రాజెక్ట్ అన్నట్లు ఉంటే పవన్, కమ్‌ బ్యాక్‌లో మాత్రం గేమ్‌ చేంజ్ చేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. 'భీమ్లానాయక్'ని రిలీజ్‌కి రెడీ చేసిన పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలని లైన్‌లో పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హిస్టారికల్ డ్రామా 'హరి హరి వీరమల్లు' చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సమ్మర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా బ్రేకులతో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవధీయుడు భగత్‌సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సురేందర్‌ రెడ్డితో ఒక సినిమాకి సైన్ చేశాడు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: