సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వరుసగా హిట్టు సినిమాలు నిర్మిస్తూ హిట్ నిర్మాత అనిపించుకున్నాడు సూర్యదేవర నాగవంశీ. ఇతడు  ఎప్పుడు కూడా మీడియా ముందు పెద్దగా కనిపించని  నిర్మాత..ఇక ఈ మధ్య కాలంలో ఫుటేజ్ కోసం ఎక్కువగానే కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ప్రేక్షకులను ఉద్దేశించి అదుపు తప్పి నోరు జారి ఇతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.దాంతో ఇతగాడిని సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ వేస్తూ తెగ ఆడుకుంటున్నారు ఆడియన్స్.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఇతడు నిర్మించిన సినిమా ''డీజే టిల్లు''. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు సినిమా కలెక్షన్స్ గురించి ఇతగాడిని కొన్ని ప్రశ్నలు అడిగారు.దీనికి ఇతగాడు స్పందిస్తూ.. ''ఈ లెక్కలన్నీ కూడా మనలాంటి మేధావులకు కావాలి కానీ.. ఆడియన్ కి వాడిచ్చే 150 రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 రూపాయల ఎంటర్టైన్మెంట్ ఇచ్చి నవ్వించాం. ఇక అదే చాలు వాడికి. వాడు ఇక హ్యాపీ'' అని నోరు జారి ఇతగాడు కామెంట్స్ చేశాడు. 


ఇక ఇతడి మాట్లకి ఆడియన్స్ కి ఒళ్ళు మండి సోషల్ మీడియాలో ఇతడిని నానా రకాలుగా తిట్టారు.ఇతగాడు నోరు జారి చేసిన కామెంట్స్ కి ఈ వివాదం చెలరేగింది.నాగవంశీ ఆడియన్స్ ను వాడు - వీడు అని సంబోధిస్తూ మాట్లాడడం పై పూర్తి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.దాంతో అతడిని ఓ రేంజ్ లో ఆడుకున్నారు.సినిమా రిలీజ్ కు ముందు ప్రేక్షక దేవుళ్ళు అని అంటారు కాని సినిమా హిట్టయ్యాక ఏక వచనంతో గౌరవం లేకుండా మాట్లాడాడని సోషల్ మీడియాలో ఇతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.మేము వేసే ఆ చిల్లరతోనే మీరు కోట్లు కోట్లు వెనకేసుకొని బ్రతుకుతారు అంటూ ఆడియన్స్ ఇతడిని బాగా తిట్టిపోశారు.ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్న స్టార్ నిర్మాతలు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదని విరుచుకుపడ్డారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఇతడు ఆడియన్స్ దెబ్బకు మూసుకున్న కళ్ళు తెరుచుకొని నోటి దురద తగ్గించుకుంటే మంచిదని అలాగే రాబోయే రోజుల్లో తన సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా వున్నాయని గ్రహించి బాగా భయపడి ప్రేక్షకులను క్షమాపణలు కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: