తెలుగు సినీ పరిశ్రమలో యాంకర్ సుమ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.. దాదాపుగా ప్రతి హీరోల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ ఖచ్చితంగా కనిపిస్తూ ఉండేది.. తన పంచ్ డైలాగులతో ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది సుమ.. స్టార్ హీరోలు సైతం ఈమె లేనిదే ఈవెంట్ జరగదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ మెసేజ్ చేసి పలు టీవీ షోలు కూడా ప్రేక్షకులు ప్రతి రోజూ చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ బాగా ఫేమస్ అయింది అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ షోలో ఒక వీడియో క్లిప్ బయటికి రావడం జరిగింది అందులో నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ ట్రోలింగ్ చేసినట్టుగా కనిపిస్తున్నట్లు సమాచారం.


ఇక ఈ వీడియోలో డీజే టిల్లు సిద్దు తో పాటు, మరికొంత మంది నటీనటులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో సుమ సిద్ధుని ఒక ప్రశ్న అడిగింది.. బంగారు రాజు కు సంబంధించిన ఫోటోలు చూపించి కథ ఏమిటో చెప్పమన్నది.. సిద్దు చెప్పలేకపోయారు.. ఆ తరువాత అక్కడే ఉన్న మరొక హీరో ప్రిన్స్ ను కూడా అడగడం జరిగింది సుమ. అతను కూడా తనకు తోచిన విధంగా చెప్పాడు.. అయితే వీరిద్దరూ కూడా బంగార్రాజు మూవీ చూడలేదని ఆమె తెలియజేసింది. దీంతో ఆమె పక్క హీరోల సినిమాలు కూడా చూడాలని సెటైర్లు కూడా వేసింది.

ఇక ఆ తర్వాత ఆమె మీరు చెప్పండి అని సిద్దు అడగడంతో.. సుమ కూడా తనకు తోచిన విధంగా కథ చెప్పింది.. దాంతో ఆమె కూడా సినిమా చూడలేదని అందరికీ అర్థమైపోయింది.. ఇలా అందరూ కలిసి బంగార్రాజు మూవీ ని ఒక ఆట ఆడే చేసుకున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో ఓటిటి లో కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: