రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కేతికశర్మ. సినిమా పరిశ్రమలో కెరియర్ ప్రారంభంలో సరైన సినిమాలు ఎంచుకుని హిట్స్ కొడితెనే భవిష్యత్తు ఉంటుంది. వరుస సినిమాలు చేస్తూ హిట్లు దక్కించుకుంటే సదరు హీరోయిన్ కు డిమాండ్స్ పెరిగిపోతాయి కానీ కొంతమంది హీరోయిన్ లు సినిమా అవకాశాలు అందుకుని వాటిని ఫ్లాప్ చేసుకోవడంతో ఒకసారిగా ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర వల్ల కొంత మంది హీరోయిన్ ల కెరీర్ మొదట్లోనే క్లోజ్ అయ్యింది.అలా ఓ యంగ్ హీరోయిన్ కు ఇప్పటి నుంచే ఆ టెన్షన్ పడుతుందట. ఆమె ఎవరో కాదు కేతీక శర్మ. 

పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా అనిల్ దర్శకత్వం వహించిన కేతికశర్మ ఈ సినిమాలో భారీ స్థాయిలో ఆకట్టుకుంది. తాను చేసిన గ్లామర్ షో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయ్యేలా చేసింది. యువతలో ఆమెకు భారీ స్థయిలో ఏర్పడింది. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఆమె హిట్ ట్రాక్ లేకపోయింది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన శౌర్య సినిమా కూడా ఈమె హీరోయిన్ గా కనిపించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ప్రస్తుతం ఆమె తన మూడవ సినిమా వైష్ణవ్ తేజ్ హీరోగా రంగ రంగ వైభవంగా చేస్తుంది. ఈ సినిమాపైనే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో చేస్తుండగా మే 27 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సక్సెస్ అయితే కేతికశర్మ కు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మాత్రం ఆమెపై ఈ ముద్ర పడటం ఖాయమని చెబుతున్నారు సినిమా విశ్లేషకులు. ఇక ఆమెతోపాటు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లు వరుస సూపర్ హిట్స్ చేసుకుంటూ పోతూ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: