సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మొదటిసారి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది .ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కళావతి అనే మొదటి పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమన్ సంగీత సారధ్యంలో సిద్దు శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాట తెగ సందడి చేస్తోంది సామాన్యుల తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం కళావతి సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆవిడను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 కాగా తాజాగా ఈ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్పులేసింది కళావతి సాంగ్ మహేష్ బాబు వేసిన డాన్స్ మూమెంట్స్ ని రిపీట్ చేస్తూ డాన్స్ వేసింది కీర్తి సురేష్ .ఇక ఆ డాన్స్ వీడియో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రికార్డ్ డాన్స్ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిమానులు కీర్తి సురేష్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోను అప్ లోడ్ చేస్తూ ఒక నోట్ ను కూడా రాసింది. 'కళావతి'నే సయంగా 'కళావతి ఛాలెంజ్' లోకి దిగింది' అంటూ పేర్కొంది. అంతేకాదు తనకు తానే ఛాలెంజ్ చేసుకుని ఈ సాంగ్ కు మహేశ్ బాబును అనుకరించింది. ఇక ఇదిలావుండగా మరోవైపు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ 'థమన్'  క్యాచీ ట్యూన్....

 అందించడం, స్టార్ సింగర్ సిద్ద్ శ్రీరామ్ మెలోడీ వాయిస్, అనంత శ్రీరామ్ మంచి లిరిక్స్ అందించడంతో సాంగ్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. అంతేకాదు విడుదల ఒక్క రోజులోనే 20 మిలియన్ల కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం 40 మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యే దిశగా పయనిస్తోంది. అయితే మరోవైపు కళావతి పాట ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తూ సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ  పాట కోసం పలువురు సెలబ్రిటీలు తమ డ్యాన్స్ మూమెంట్స్‌ను పంచుకున్నారు.కాగా  నిన్న మహేశ్ బాబు డాటర్ 'సితార' కూడా అచ్చు తండ్రిలాగే డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం . ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: