బుల్లితెరపై బిగ్ బాస్ షో కి ఇలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో బిగ్ బాస్ ప్రసారమవుతుంది. ఇక తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ రియాల్టీ షో. అయితే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీలో బిగ్ బాస్ సందడి మొదలు కాబోతుంది. ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక, అగ్రిమెంట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంపికైన వాళ్లను కూడా క్వారాంటైన్  విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి సీజన్ బిగ్ బాస్ కి హైప్ తెచ్చేందుకు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

పాత, కొత్త కంటెస్టెంట్స్ తో ఓ టి టి తొలి సీజన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానాతోపాటు ఆదర్శ్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా బిగ్ బాస్ ఓ టి టి తొలి సీజన్ లో పాల్గొనపోతున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా యాంకర్ వర్షిని, యాంకర్ శివ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, ఢీ10 రాజు, సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వందన, ప్రత్యూష పేర్లు బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ గా చెబుతున్నారు. అయితే వీరే కాకుండా ఒకప్పటి తెలుగు హీరోయిన్ బిందు మాధవి ని కూడా బిగ్ బాస్  ఓటీటీ తొలి సీజన్లో స్పెషల్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపుతున్నట్లు సమాచారం. తెలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో..

 మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవికి తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అందుకే ఆమె కోలీవుడ్ కి వెళ్లి అక్కడ ఎక్కువ ఆఫర్లను సంపాదించుకుంది. అయితే అక్కడ కూడా ఈ మధ్య అవకాశాలు లేకపోవడంతో ఈ మధ్య ఆహా వెబ్ సిరీస్ లో నటించి  అటెన్షన్ క్రియేట్ చేసింది. ఓటీటీలో మస్తీ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన బిందు మాధవి.. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఎంట్రీ ఇస్తూ మళ్ళీ క్రేజ్ తెచ్చుకునేందుకు రెడీ అయిందట. బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఎలాగైనా గుర్తింపు తెచ్చుకుని మళ్లీ సినిమాల్లో అవకాశాలు అందుకోవాలని ఈ హీరోయిన్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఓటింగ్ మన తెలుగు హీరోయిన్ బిందు మాధవికి ఎలాంటి గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: