తేజ అసలు పేరు జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఆసక్తి అయిన తండ్రి చౌదరికి సినిమాతో కొన్ని లింకులు ఉండేవి. దర్శకుడు తేజ పినతండ్రి జాతి మాధవరావు ప్రముఖ మేకప్ మెన్. ఈ క్రమంలోనే తండ్రి అకాల మరణం తర్వాత బాబాయ్ ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగుపెట్టారు తేజ. ఇండస్ట్రీ లో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని అంతకంతకూ ఎదుగుతూ దర్శకుడిగా మారిపోయారు. కులం మతం అనే తేడా ను పూర్తిగా ద్వేషించే తేజ అప్పట్లో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.
ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. అక్కడ మంచి అవకాశాలు ఈ దర్శకుడుని వరించాయి. అమీర్ ఖాన్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. కానీ అంతలోనే దర్శకత్వం చేయాలనే ఆలోచన తేజ మనసులో వచ్చింది. దీంతో బాలీవుడ్ లో కాకుండా మాతృభాషలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఉషాకిరణ్ మూవీ నిర్మాణంలో చిత్రం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకొంది. అన్నట్లు ఇదే సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత నువ్వు నేను సినిమా.. ఈ సినిమా కూడా బంపర్ హిట్ ఇక ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన జయం మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న తేజ తర్వాత మహేష్ బాబుతో నిజం సినిమా చేశాడు. కానీ సినిమా అనుకున్నంతగా రాణించలేదు. కానీ అవార్డులు మాత్రం కొట్టేసింది. ఇక ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం సహా మరికొన్ని సినిమాలు చేసిన మంచి హిట్ అందుకోలేకపోయాడు. దీంతో తేజ పని అయిపోయింది అని అనుకున్నారు. 2017 లో రానా కాజల్ జంటగా నేనే రాజు నేనే మంత్రి నేనే రూపొందించగా.. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన సీత ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన తేజ ఇప్పుడు మాత్రం రెండుట్రెండ్ వెనుక పరిగెత్త లేక వెనకబడిపోయారు..