గత కొద్ది రోజులుగా బాలయ్య జోరు పెంచాడు.అయితే అభిమానులు కోరుకున్న విధంగా ట్రెండింగ్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు ఓటీటీ వరకు వచ్చి టాక్ షో చేశాడు.అయితే ప్రస్తుతం ఇదే స్పీడ్ లో తాను నటించిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ తెరకెక్కాలని పట్టుబడుతున్నాడట.గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం చాలా కాలం తర్వాత బాలయ్యకు భారీ బ్లాక్‌ బస్టర్‌ను అందించింది.బాలయ్య సింహా, లెజెండ్ చిత్రాలను మించి వసూళ్లను కొల్లగొట్టిం .ప్రస్తుతం ఇటు థియేటర్స్ లోనూ, అటు ఓటీటీలో దుమ్మురేపింది.ఇక అందుకే ఇప్పుడు ఇమిడియెట్ గా సీక్వెల్ తెరకెక్కాలి అంటున్నాడట. 

అయితే ఇందుకోసం దర్శకుడు బోయపాటి పై ఒత్తిడి తీసుకొస్తున్నాడట.బాలయ్య నటించిన అఖండ తర్వాత బన్నితో బోయపాటి మూవీ చేయాల్సి ఉండగా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు.ఇక దాంతో బోయపాటి ఇమిడియెట్ గా రామ్ తో మూవీ లాక్ చేసుకున్నాడు.కాగా ఎనర్జిటిక్ స్టార్ తో కలసి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు.తాజాగా ఇటీవలే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది.కాగా రామ్ తో మూవీ తర్వాత బోయపాటి అఖండ2 పై ఫోకస్ పెట్టనున్నాడట.అయితే అఖండ 2 స్టోరీ లైన్ కు సంబంధించినలీడ్ ను మొదటి భాగం క్లైమాక్స్ లో చెప్పకనే చెప్పాడు బోయపాటి.

కాగా అందుకే రామ్ తో మూవీ కంప్లీట్ కాగానే అఖండ 2 పట్టాలెక్కించాలనుకుంటున్నాడట.తజాగా పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కాగా ఈ వేడి తగ్గకముందే పార్ట్ 2 రిలీజ్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడు బన్ని. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఇదే ట్రెండ్ ను బాలయ్య అండ్ బోయపాటి ఫాలో కావాలనుకుంటున్నారు.అయితే అన్ని కుదిరితే 2023 అఖండ పార్ట్‌ 2 పట్టాలెక్కనుంది.ఇక బోయపాటి ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: