ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారట.ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే భీమ్లా నాయక్ సినిమాలో పాటలకు ప్రేక్షకులకు భారీగా స్పందన లభించిందట.
కానీ ట్రైలర్ చూసిన తర్వాత కాస్త నిరాశ చెందారట.ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత బాగా లేదని అంటున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై ఇదేంటి థమన్ భయ్యా ఇలా చేశావు? అఖండ సినిమాకు అదిరిపోయే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు కదా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే కదా . ట్రైలర్ ని చూసిన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. టైలర్ లో పవన్ ను చూసి అభిమానులు బాగా ఖుషి అవుతున్నారు. ఇక నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు తమన్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు.భీమ్లా నాయక్ ప్రిరీలీజ్ ఈవెంట్ అట్టహాసంగా కొనసాగుతోంది. భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ టీమ్ గూస్ బంప్స్ తెప్పించేలా పాటలు కూడా పాడింది. ఈ సాంగ్ గురించి థమన్ మాట్లాడుతూ.. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ మా అందరికీ కూడా చాలా చాలా ఫేవరేట్ సాంగ్. హీరో ఇంట్రో సాంగ్ చేయాలంటే ఒక పూనకం వస్తుంది. కానీ అది పవర్ స్టార్ కు చేయడమంటే రెండు మూడు కీ బోర్డులు విరగ్గొట్టి కానీ ఈ ట్యూన్ రాలేదు ఈ పాట మాక్కూడా పెద్ద ప్రయోగం లాంటిదని గుంటూరు కారం ఆ యూనిఫారమ్.. మంటెత్తిపోద్ది నేరాలు చేస్తే.. సెలవు అంటు అనడు.. శనాది వారం అంటూ పాడుకొచ్చాడట థమన్. ఈ పాటకు సింగర్ ఎవరనుకున్నపుడు రస్తిక్ వాయిస్ ఉండాలని రామ్ మిర్యాలను పెట్టామని ఆయన చెప్పుకొచ్చాడు.
పాట రాసిన రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ పాట తయారుచేసినపుడు మ్యాజికల్ మూమెంట్స్.. మూడు పాటలు మూడు రోజుల తక్కువ వ్యవధిలోనే చేశాము. టైటిల్ ట్రాక్ ఉదయం కూర్చొని సాయంత్రం లోపు పూర్తి చేశాం. సాయంత్రం త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ వచ్చి పాట అని ప్రతీ అక్షరాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ..నా చేతిలో ఉన్న ప్యాడ్ తీసుకొని ఆ లిరిక్స్ చదువుతూ..ఓ రచనకు ఆయనిచ్చేట్వంటి సమున్నతమైన సంస్కారం మరియు గౌరవం అలాంటిదన్నారు.