జనవరి 14వ తేదీన విడుదల కావాల్సిన రాధే శ్యామ్ చిత్రం కరుణ కారణంగా పోస్ట్పోన్ కాగా మళ్లీ ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్. ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు భారీ స్థాయిలో పెంచింది అని చెప్పవచ్చు. మొదటి నుంచి ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా కాకుండా ప్రేమకథా చిత్రం తెరకెక్కింది అని చెప్పడానికి చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విడుదలకు ఇంకా పదిహేను రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించగా ఇప్పుడు ఈ వేదికను ముంబైలో నిర్వహించ బోతున్నట్లు తెలుస్తుంది. దాంతో ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి ప్రమోషనల్ బజ్ ను పెంచాలని చూస్తుంది. 


ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుస సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపుగా సినిమా ను పూర్తి చేసిన ఆయన మరొకవైపు ఆది పురుష్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఆ విధంగా ఈ రెండు చిత్రాలను కూడా ఈ ఏడాది ని విడుదల చేసి ఆ తర్వాత చేయబోయే సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో నటించడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది అని చెబుతున్నడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: