బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం అలియా భట్ అక్షరాల 9 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ అనేది తీసుకోగా అలియా భట్ పాత్ర సినిమాలో కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే ఉంటుందని సమాచారం తెలుస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కాకముందే తెలుగు సినిమాలలో ఈ బ్యూటీకి సినిమా అఫర్లు దక్కుతుండటం గమనార్హం. అలియా భట్ టాలీవుడ్ హీరోయిన్లను మించి 5,6 రెట్లు రెమ్యునరేషన్ అనేది భారీగా డిమాండ్ చేస్తున్నా కాని నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడకుండా సిద్ధంగా ఉన్నారు.అయితే తాజాగా అలియా భట్ నటించిన పాన్ ఇండియా సినిమా గంగూబాయి కతియావాడీ థియేటర్లలో విడుదలైంది. 



ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ అనేది వస్తోంది. బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాల స్థాయిలో ఈ సినిమా లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే అలియా భట్ పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలా అంటే చాలా తీవ్రమైన నెగిటివిటీ అనేది ఉంది. ఇప్పుడు ఇదే ఆర్.ఆర్.ఆర్ మూవీ టీం కి పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత నెపోటిజం వల్ల అలియా భట్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ అంతకంతకూ పెరుగుతుండటం అనేది గమనార్హం.ఇక దాని ఫలితంగానే అలియా భట్ నటించిన సడక్2 ట్రైలర్ కు ఊహించని స్థాయిలో డిస్ లైక్స్ అనేవి వచ్చాయి. గంగూబాయి కతియావాడీ సినిమాకు ఐఎండీబీ రేటింగ్ కూడా కేవలం 3.7గా ఉండటం గమనార్హం. అయితే బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అనేవి వచ్చాయి. అయితే అలియా భట్ పై ఉన్న నెగిటివిటీ వల్ల ఈ సినిమాకు తక్కువ ఐఎండీబీ రేటింగ్ వచ్చిందని సమాచారం కూడా అందుతోంది. 


ఆర్ఆర్ఆర్ మూవీపై అలియా ఎఫెక్ట్ పడకూడదని అభిమానులు ముఖ్యంగా మన టాలీవుడ్ అభిమానులు కోరుకుంటున్నారు.అలియా భట్ సైతం వివాదాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అలియా భట్ కు ఆర్.ఆర్.ఆర్ పుణ్యమా అని పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: