టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ మంచి పాపులారిటీ అందుకున్న రాశీ కన్నా ఇప్పుడు పెద్ద సినిమాల అవకాశాలను అందుకోకపోవడం ఆమె అభిమానులను తీవ్ర స్థాయి లో నిరాశపరుస్తుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మంచి మంచి సినిమాలలోనే కనిపించి ప్రేక్షకులను మైమరిపించింది. తొలుత ఈమె గ్లామర్ పాత్రలు పోషించడానికి ఏమాత్రం అంగీకరించేది కాదు.

కానీ ఆ తర్వాత కాలంలో సినిమాలలో పాత్రలు డిమాండ్ చేయడంతో తన అభిప్రాయాన్ని మార్చుకుంది. గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతూ ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న గ్లామర్ కథానాయికలలో ఒకరిగా నిలిచింది రాశీ కన్నా.. వాస్తవానికి ఈమె ఊహించిన స్థాయిలో తెలుగు లో అవకాశాలను రాబట్టుకోవడం లేదనే చెప్పాలి.  ఎందుకంటే తెలుగు సినిమాలలో ఈమె కంటే బాగా నటించే బాగా గ్లామర్ ను పంచేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మరియు హీరోలు వేరే హీరోయిన్స్ కి షిఫ్ట్ అయిపోతున్నారు.

ఈ విషయాన్ని పసిగట్టి లేటుగా రియాక్ట్ అయిన రాశిఖన్నా ఇప్పుడు వారి స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పు డు ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఆమె చేతిలో ఒకటి రెండు సినిమాల్లో తప్ప పెద్దగా సినిమాలేవీ లేవు అవి కూడా చిన్న హీరోల సినిమాలే కావడం ఆమె కెరీర్ ప్రమాదంలో ఉందని చెప్పడానికి నిదర్శనం. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అజయ్ దేవగన్ సరసన రుద్ర అనే సినిమాలో ఆమె నటిస్తోంది హాట్ స్టార్ లో త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: