బాలివుడ్ లో హీరో, హీరోయిన్లు పెళ్ళి చెసుకొని కొద్ది రోజులు బాగానే ఉన్న తర్వాత కొన్ని మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకొని వేరే వాళ్ళ తో డేటింగ్ చెస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మిస్టర్ ఫెర్ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలే ప్రేమ, రిలేషన్ అంటూ తిరుగుతున్నారు. ఆ జాబితాలోకి హీరో హృతిక్ రోషన్ కూడా చేరాడు.. మొన్నటివరకూ కంగనాతో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వినిపించాయి. వాటిలో నిజం లేదని తెల్చెసాడు. ఇప్పుడు మరో అమ్మాయి తో రిలేషన్ లో వున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.


ఈ రొమాంటిక్‌ హీరో సభా ఆజాద్ అనే అమ్మాయితో కలిసి ముంబయిలోని ఒక ఫేమస్ జపనీస్ రెస్టారెంట్లో ఆ మధ్య లంచ్ కు హాజరయ్యాడు. రెస్టారెంట్ నుండి బయటికి వచ్చేటపుడు హృతిక్ అమ్మాయి చేయి పట్టుకుని కారు దగ్గరకు తీసుకొని వచ్చాడు. అది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య ఆమె హృతిక్ రోషన్ వాళ్ళ ఇంటికి ఒక ఆదివారం వెళ్ళింది. ఫ్యామిలీతో సభా గడిపిన తీరును సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు.. ఈ విషయం పై ముంబాయి మీడియా కూడా ఎటువంటి వార్థను రాయలేదు.. అది నిజమా? కాదా? అనే కోణంలో ఆలోచిస్తున్నారు.


ఇది ఇలా ఉండగా..తొలిసారి సభా గురించి హృతిక్ ఓ పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు మరోసారి వీళ్ళ వ్యవహారం మీడియాలో తెగ వినిపిస్తుంది.కాగా,సబా ఆజాద్, నసీరుద్దీన్ షా కొడుకు ఇమాద్ షా కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేసిన హృతిక్ రోషన్.. 'కిల్ ఇట్ యూ గాయ్స్'అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. సబా సైతం హృతిక్‌కి థ్యాంక్స్‌ చెబుతూ మరో పోస్ట్‌ పెట్టింది. ఇలా వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి మీడియా లో మరోసారి ఈ ప్రచారం జోరందుకుంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందనే నిజం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: