రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయరాం, మురళి శర్మ, ప్రియదర్శి, భాగ్యశ్రీ, కృష్ణంరాజు తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా ప్రముఖ కెమెరా మ్యాన్ మనోజ్ పరమహంస దీనికి ఫోటోగ్రఫి అందించారు.
యువ దర్శకుడు రాధాకృష్ణ తీసిన ఈ సినిమా కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథకి దృశ్యరూపకంగా కొన్ని కల్పిత అంశాల మేళవింపుతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్, తో పాటు కొన్నాళ్ల క్రితం విడుదలైన థియేట్రీకల్ ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసాయి అనే చెప్పాలి. ఇక గతంలో పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతూ ఉండడంతో టీమ్, ప్రమోషన్ సహా ఇతర పబ్లిసిటీ కార్యక్రమాలపై గట్టిగా దృష్టి పెట్టింది.
రెండు రోజుల క్రితం ఈ మూవీలోని ఈ రాతలే సాంగ్ ఫుల్ వీడియోని యూట్యూబ్ లో రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ తీసుకువచ్చారు. మరోవైపు ఈ మూవీకి సంబంధించి అటు నార్త్ లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేసిన నిర్మాతలు, ఇటీవల ఢిల్లీ లోని మెట్రో ట్రైన్స్ పై రాధేశ్యామ్ పోస్టర్స్ వేయించారు. వాటి ద్వారా సినిమాకి మరింతగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. అలానే పలు ఇతర ముఖ్య నగరాల్లో సైతం మరింత విస్తృతంగా ప్రమోషన్స్ షురూ చేసిన రాధేశ్యామ్ టీమ్, పక్కాగా మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధం అవుతోంది. మరికొద్దిరోజుల్లో మన ముందుకి రానున్న రాధేశ్యామ్ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కాగా ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: