ఆకాశ్ పూరి 'రొమాంటిక్' సినిమా సమయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. పూరీ జగన్నాథ్ కథ, కథనం, మాటలు అందించిన ఈ సినిమాతో హిట్ కొడతామని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్ట్రాంగ్‌గా చెప్పాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆకాశ్ పూరీ ఆశలకి బ్రేకులు పడ్డాయి. ఆకాశ్ పూరీ ఇప్పటివరకు 'ఆంధ్రాపోరి, మెహబూబా, రొమాంటిక్' సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేశాడు. అయితే ఈ సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. దీంతో ఆకాశ్ పూరికి సొంత మార్కెట్ కూడా క్రియేట్ కాలేదు. పూరీ జగన్నాథ్ కొడుకుకి ఒక్క హిట్ కూడా లేదనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇలాంటి సిట్యువేషన్స్‌లో 'చోర్ బజార్' సినిమాతో జనాలముందుకొస్తున్నాడు ఆకాశ్.
'దళం, జార్జి రెడ్డి' సినిమాలతో స్పెషల్ మార్క్ క్రియేట్ చేసిన జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్ పూరి 'చోర్ బజార్' అనే సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ హైదరాబాదీ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆకాశ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. లోకల్ హైదరాబాదీ ఫ్లేవర్‌తో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ హిట్ అయ్యింది. 'డిజె టిల్లు'తో సిద్ధుకి పేరొచ్చింది. ఇక హైదరాబాదీ ఫ్లేవర్‌తో వస్తోన్న 'చోర్ బజార్' కూడా ఇలాగే హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నాడు ఆకాశ్.