తెలుగు రాష్ట్రాలలో భీమ్లానాయక్ మేనియా కొనసాగుతుంది.. తెలంగాణాలో సినిమా మంచి టాక్ తో పాటుగా,కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నేటి తో సినిమా విడుదల అయ్యి రెండు రోజులు అవుతున్నా ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతుంది. ఎపిలో మాత్రం సినిమా పరిస్థతులు తల క్రిందులు అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏపి ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీ కి మధ్య సినిమా టిక్కెట్ల వ్యవహారం పై తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై సినీ ప్రముఖులు కూడా జగన్ కలిసి మాట్లాడారు.. అయిన మద్దతూ ఇస్తున్నాము అంటూ టిక్కెట్లు ధర మాత్రం పెంచుకునేందుకు ఆమోదం ఇవ్వలేదు.


ఒకవేళ టిక్కెట్లు ప్రభుత్వ రేటు కన్నా కూడా ఎక్కువగా పెడితే ఆ థియెటర్లను మూసివేస్తున్నారు. ఐదవ షోను వెయ్యకుండా నిబంధనలు జారీ చేయడంపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని, ఆర్ నారాయణ మూర్తి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే.. త్వరలోనె టిక్కెట్ల రేటును పెంచుతామని చెప్పారు.


అయితే, పవన్ భీమ్లా నాయక్ సినిమా పై మాత్రం ఏపి సర్కార్ దారుణంగా ప్రవర్థించింది. సినిమా టిక్కెట్ల ధరల తో సినిమాలను వెయలెమంటూ థియెటర్ల యాజమాన్యాలు హాళ్లను మూసివేశారు. ఇది పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగించింది. అయిన ఏపి ప్రభుత్వం ఈ విషయం పై మాట మార్చలేదు. ఇప్పటికే ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు. తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు.,సృజన… సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటీ ? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా ? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ? ఎంతగా ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు ' అంటూ ట్వీట్ పేర్కొన్నారు.అది కాస్త చర్చనీయాంశంగా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: