టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సురేఖ వాణి మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక గతంతో పోలిస్తే సురేఖ వాణికి సినిమా ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆంటీ కుర్ర బ్యూటిల కంటే కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే.అలాగే ఈ సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో బాగానే గుర్తింపు ఉంది. సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లకు తనదైన స్టైల్ లో రిప్లై ఇస్తుంది. ఇక సురేఖ వాణి రెండో పెళ్లి గురించి గతంలో పలు వార్తలు వైరల్ కాగా ఆ వార్తలను ఆమె ఖండించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా సుప్రీత ఓ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో సురేఖ వాణి పెళ్లి గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.తన నాన్నకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని సుప్రీత చెప్పింది. అందుకే నేనే తలకొరివి పెట్టానని ఆమె చెప్పింది.నాన్న సోదరుడు పాడె మోయవద్దని చెప్పాడని నాన్న బంధువులు చివరి చూపు చూడటానికి కూడా రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.


అమ్మ తరపు బంధువులు ఆ సమయంలో అన్ని పనులను చూసుకున్నారని ఈ విషయాలు ఎవరికీ తెలియదని సుప్రీత తెలిపింది.రెండో పెళ్లి అనేది అమ్మ పూర్తిగా తీసుకునే నిర్ణయమని నాకు మాత్రం అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉందని సుప్రీత వెల్లడించింది. అయితే ఏం జరుగుతుందో సమయం డిసైడ్ చేస్తుందని సుప్రీత పేర్కొంది. అమ్మ తన కెరీర్ తో పోల్చితే తన కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారని సుప్రీత వెల్లడించింది. ఇప్పుడిప్పుడే తాము సెటిల్ అవుతున్నామని సుప్రీత పేర్కొన్నది. తన నాన్న లేని బాధను ఇప్పటికీ ఫీలవుతున్నామని సుప్రీత అనింది.సురేఖతో కలిసి సుప్రీత సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదనే విషయం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. సురేఖ వాణి రెండో పెళ్లి గురించి సుప్రీత చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం నెట్టింటా బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.ఇంకా సుప్రీత, సురేఖ వాణి అలా పొట్టి పొట్టి డ్రెస్సులో డాన్స్ లు వీడియోలు ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్ లో పెడుతుంటే ఆడియన్స్ వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: