కోలీవుడ్ స్టార్ హీరో గా పేరు పొందిన సూర్య ప్రస్తుతం ఎతర్క్కుం తునింధవన్‌. మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో ఈటి అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. కరోనా సమయంలో హీరో సూర్య సినిమాలు అన్ని ఎక్కువగా ఓటీటీలోనే విడుదల చేయడం జరిగింది. ఇక ఆ సినిమాలన్నీ మంచి విజయాలను చేకూర్చాయి సూర్యకి. ఇక హీరో సూర్యని మరొకసారి స్టార్ పొజిషన్లో కుచ్చ పెట్టాయని చెప్పవచ్చు. అయితే తాజాగా నటిస్తున్న ఈటి సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ రానే వచ్చింది వాటి గురించి తెలుసుకుందాం.


సూర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో ఇక ఈ సినిమా థియేటర్లో నే విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ వచ్చేనెల 2 వ తేదీన 11 గంటలకి విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి సూర్య అభిమానులు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


సూర్య ఈ సినిమాతో నైనా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారు ఏమో చూడాలి. సూర్య ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ రూపంలో ఇచ్చే సినిమాలను చేస్తూ ఉంటాడు. మరి ఈ సారి ఈ సినిమాలో ఎలాంటి సందేశాన్ని చూపిస్తాడో చూడాలి. ఈ సినిమాకి సంగీతం ఇమ్మాన్ అందించారు. ఇక సూర్య నటించిన దేవా ఆరు వంటి సినిమాల తర్వాత ఇది యాక్షన్ సినిమా కాబట్టి దీనిపైన చాలా హోప్స్ వున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్  హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: