దానికి తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో ఇప్పుడు వరుస సినిమాలు ఉండడంతో అందరిలో చిన్నపాటి టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా రవితేజ అభిమానులలో ఈ టెన్షన్ ఉందని చెప్పొచ్చు. క్రాక్ సినిమా తో గాడిలో పడ్డాడు అనుకుంటే ఆ వెంటనే ఖిలాడీ దారుణంగా ఫ్లాప్ అవడం ఒక్కసారిగా అందరిని కలవరపరుస్తోంది. దాంతో శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దివ్యాన్శ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా లో రవితేజ గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిసిస్తున్నాడు. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇకపోతే రవితేజ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను ఒకే చేశాడు. ధమాకా మరియు రావణాసుర సినిమాలను కూడా అయన ఒకే చేయగా ఈ చిత్రాలు ప్రేక్షకులను భారీగా అలరిస్తాయి అని చెప్పాలి. మరి ఇలా వరుస సినిమాలు చేస్తూ అయన ఇతర హీరోలకు ధీటు గా ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమాలను అయన పాన్ ఇండియా రేంజ్ లో చేస్తుండడం విషెహ్సం.