సినీ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ లేకపోతే ఎలాంటి హీరో అయినా సరే కనిపించకుండా పోవడం ఖాయం.  స్టార్ హీరోలు ఒకసారి అట్టర్ ఫ్లాప్ అందుకున్నారు అంటే ఆ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా భయపడిపోతుంటారు.అయితే  అందుకే స్టార్ హీరోలు కథల ఎంపికలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు.ఇకపోతే కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఊహించని రేంజిలో ఫ్లాపులు వచ్చినా ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు అదే ప్రభావం కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అచ్చంగా ఇలాంటి చేదు అనుభవమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎదురైంది అని చెప్పాలి.

ఇకపోతే గతంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలో నటించడం జరిగింది.అయితే సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పుడు విన్నా కూడా ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఇకపోతే  అప్పటికే ఫామ్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. రామ్ చరణ్ నటించిన మగధీర లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో రామ్ చరణ్ కెరీర్లోనే ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.అయితే ఈ సినిమా వారం రోజులు కూడా థియేటర్లలో సరిగా ఆడలేదు.

ఇకపోతే ఈ సినిమా బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగబాబు ఎంతో ఖర్చు పెట్టారు. అయితే చివరికి సినిమా ఫ్లాప్ అవ్వడంతో నష్టాలు వచ్చి ఎన్నో రోజులు కోలుకోలేని విధంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. ఇకపోతే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కొంతమందికి నచ్చిన చాలా మందికి అర్థం కాలేదు దీంతో ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతేకాకుండా  రామ్ చరణ్ కూడా నైరాశ్యంలో మునిగిపోయాడట. అయితే ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత దర్శక నిర్మాతలు ఎవరూ సినిమా చేయడానికి ముందుకు రాలేదని స్వయంగా చెప్పాడు చరణ్. అయితే ఇక  ఎవరూ ముందుకురాని సమయంలో నాతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చింది చౌదరి మాత్రమే ఈ విషయాన్ని ఎప్పటికీ నా జీవితంలో గుర్తుపెట్టుకుంటా అంటూ ఇంటర్వ్యూలో ఎవరూ ఊహించని విధంగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: