తెలుగులో హీరోగా మరియు కమెడియన్ గా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సునీల్ ఒకరు. హీరోగా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారట.

భీమ్లా నాయక్ సినిమాలో ఒక సాంగ్ లో సునీల్ కనిపించగా సునీల్ నటించిన కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారని సమాచారం.. నిన్న సునీల్ పుట్టినరోజు కాగా పలువురు సినీ ప్రముఖులు సునీల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ ను సక్సెస్ ట్రాక్ లోకి చేర్చేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నారు. అయితే సునీల్ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలు పడ్డారట.. ఐదు సంవత్సరాల వయస్సులోనే సునీల్ తన తండ్రిని కోల్పోయారు. సునీల్ పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ కాగా సుమారు 170కు పైగా సినిమాలలో సునీల్ నటించారు. బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో బిజీగా ఉన్న కమెడియన్ గా సునీల్ మంచి పేరు తెచ్చుకున్నారు.

సునీల్ తండ్రి తపాలా శాఖ ఉద్యోగి కాగా సునీల్ తండ్రి మరణించడంతో సునీల్ తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. బాల్యంలో సునీల్ పెదపులివర్రు ప్రాంతంలో చదువుకున్నారు. డ్యాన్సర్ కావాలని అనుకున్న సునీల్ త్రివిక్రమ్ సలహాతో కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. సునీల్ ది అరేంజ్డ్ మ్యారేజ్ కాగా ఆయన భార్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉండగా ఆ పాప పేరు కుందన కావడం గమనార్హం.

సెకండ్ ఇన్నింగ్స్ లో సునీల్ కు వరుస ఆఫర్లు వస్తున్నా కెరీర్ కు ప్లస్ అయ్యే స్థాయిలో ఆఫర్లు మాత్రం రావడం లేదు. అందాల రాముడు మరియు మర్యాద రామన్న సినిమాలతో పాటు పూల రంగడు సినిమాతో సునీల్ హీరోగా సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడం విశేషం...

మరింత సమాచారం తెలుసుకోండి: