ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సూర్య ఇటీవలే హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇక ఈ సినిమా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో హీరో సూర్యకు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
ఈ సందర్భంగా మాట్లాడిన బోయపాటి శ్రీను.. సూర్య నేను తప్పకుండా ఒక సినిమా చేస్తాము అయితే అది ఎప్పుడూ అనేది చెప్పలేం.. కానీ తప్పకుండా సినిమా మాత్రం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగు ప్రేక్షకులు సూర్యాన్ని తమిళ హీరో గా కాకుండా తమలో ఒకరిగానే చూస్తున్నారని బోయపాటి అన్నారు. దీంతో ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి.ఎందుకంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను అదే సమయంలో ఇక యాక్షన్ సినిమాల్లో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ సినిమాబ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది..