ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న రామ్ చరణ్ ఇక మరికొన్ని రోజుల్లో త్రిబుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదించుకునేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25వ తేదీన విడుదల రావాల్సి ఉండగా.. ఇక ప్రస్తుతం శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఇలా వరుస సినిమాలతో బిజీగా వున్న రామ్ చరణ్ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు..


 ఇప్పటికే ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించి ఆకట్టుకున్న రామ్ చరణ్ ఇక ఇప్పుడు మరో సరికొత్త ఉత్పత్తికి ప్రమోషన్ కోసం ప్రకటన లో నటించాడు అని తెలుస్తోంది. ప్రముఖ శీతల పానీయాల కంపెనీ అయిన పార్లే ఆగ్రో సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఫ్రూటీ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో పాటు త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ భార్య పాత్రలో నటించిన  బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియాభట్ కూడా ఇక ఇదే వాణిజ్య ప్రకటనలో కలిసి కనిపించటం గమనార్హం.


 అయితే భారత బేవరేజెస్ ఉత్పత్తిలో అగ్రగామిగా కొనసాగుతున్న పార్లే ఆగ్రో సంస్థ ప్రొడక్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఆలియాభట్ ప్రచారకర్తగా ఉంది ఆలియా భట్. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ తో  చరణ్ కూడా వచ్చి చేరిపోయాడు. ఇటీవలే ఈ విషయాన్ని పార్లే ఆగ్రో సంస్థ తెలిపింది. ఇక హీరో రామ్చరణ్ పార్లే ఆగ్రో కుటుంబంలో భాగమైనందుకు తమ ఫ్రూటీ తో అనుబంధం కలిగి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకొచ్చారు. కాగా ఇది కాకుండా ఇంకా ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: