కూతురికి ఏ లోటు రాకుండా ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటుంది. అంతే కాదు కూతురుతో కలిసి ఎన్నో పాటలపై డాన్సులు చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా చేస్తూ ఉంటుంది సురేఖవాణి. ఇక ఇటీవల కాలంలో ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ పెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది సురేఖవాణి.
ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి సురేఖవాణి నెంబర్ అంటూ సోషల్ మీడియాలో ఒక నెంబర్ చెక్కర్లు కొడుతుంది. ఇక నెంబర్ నుంచి కొంతమంది వ్యక్తులు మెసేజ్ చేస్తూ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నట్లు సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఇదే విషయంపై సురేఖవాణి స్పందించింది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నెంబర్ తనది కాదని ఎవరూ స్పందించ వద్దని ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయవద్దు అంటూ కోరింది.. తనకు ఫేస్బుక్ ఖాతాలు లేవని ఎన్నోసార్లు ఈ విషయాన్ని కూడా చెప్పాను అంటూ క్లారిటి ఇచ్చింది. ఇక సురేఖవాణి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు అందరూ అప్రమత్తమయ్యారు.
ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది సైబర్ నేరగాళ్లు సినీ సెలబ్రిటీల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం.. ఇక అకౌంట్లతో సినీ సెలబ్రిటీల స్నేహితులను సంప్రదించడం.. డబ్బులు కావాలి అంటూ అడగడం లాంటివి చేస్తున్న ఘటనలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి