ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా రాధేశ్యామ్ సినిమా మాటలు వినిపిస్తున్నాయి.. గతం లో ఎప్పుడూ కనిపించని విధంగా డార్లింగ్ ఈ సినిమాలో కనిపించడంతో సినిమా పై జనాలకు ఆసక్తి మరింత పెరిగిపొయింది. సినిమా విడుదల కోసం రెబల్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి..భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా మార్చి 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.


ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమంలో చిత్రబృందం ఫుల్ బిజీ అయిపోయింది..మొన్న ముంబైలో కండక్ట్ చేసిన ప్రీరిలిజ్ ఈవెంట్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఇది ఇలా ఉండగా నిన్న చెన్నైలో మరో ఈవెంట్ ను నిర్వహించారు.. తమిళ్ లో ప్రభాస్ మాట్లాడి అందరినీ షాక్ కు గురి చేశారు.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మొత్తానికి చిత్రయూనిట్ చేస్తున్న ప్రయత్నాలు సినిమా పై ఆసక్థిని పెంచుతున్నాయి. కాగా, హస్తసాముద్రికుడిగా కనిపించనున్నారు. చేతిపై ఉన్న గీతలని చూసి జాతకాలు చెబుతూ ఉంటారు ప్రభాస్. ట్రైలర్ కట్ లో కనిపించిన సీన్స్, మ్యూజిక్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తున్నాయి.


మాస్ సినిమాలనే చేసిన ప్రభాస్.. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ని చూస్తె తెలుస్తోంది.ఈ సీన్స్ గురించి ఓపెన్ అయిన ప్రభాస్.. ఈ సన్నివేశాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డానని చెప్పారు. షూటింగ్ సమయంలో సెట్లో అంతమంది ఉండగా,వారి మధ్యలో షర్ట్ లేకుండా కిస్ చేయాల్సి వచ్చినపుడు బాగా ఇబ్బంది పడ్డానని అన్నాడు. ప్రేమ కథా చిత్రం కనుక ఇలాంటి సీన్లు చెయ్యక తప్పలేదు. డైరెక్టర్ చెప్పిన దానికి నో చెప్పలేను అని డార్లింగ్ అన్నాడు.. మొత్తానికి డార్లింగ్ ఇలాంటి సీన్లు కూడా చేస్తాడు అని ఈ సినిమా తో తెలిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: